- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పవన్ కల్యాణ్ మీ కామెడీ ఆపండి: శ్రీనివాస్
by srinivas |

X
దిశ ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయిపోయిన పెళ్లికి బాజాలు కొడుతున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కరోనా నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో పురోహితులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి 5 వేల గౌరవ వేతనం అందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం పురోహితులకు ఇప్పటికే ఆర్థికసాయం చేసిందని అన్న ఆయన, పవన్ కల్యాణ్ కామెడీ చేయడం ఆపాలని సూచించారు. పవన్ కల్యాణ్‌కి లక్షల పుస్తకాలు చదివి మతి భ్రమించినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. పార్ట్ టైమ్ రాజకీయాలు చేసే ప్యాకేజీ పవన్ కల్యాణ్ కాస్త ముందుగా మేల్కొవాలని సెటైర్లు వేశారు. పురోహితులపై కపట ప్రేమ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
Next Story