వాహనాల ఫిజికల్ రిజిస్ట్రేషన్ బంద్

by Shyam |
వాహనాల ఫిజికల్ రిజిస్ట్రేషన్ బంద్
X

లాక్ డౌన్‌తో రవాణా శాఖ నిర్ణయం

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నిరోధ లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏల్లో వాహనాల ఫిజికల్ రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ఆగిపోయింది. స్లాట్ గడువులో టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్‌కు నమోదు చేసుకుంటే వాహనానికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారు. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నట్టు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. అయితే ఇలా రిజిస్టర్ అయిన వాహనాన్ని లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందంటున్నారు. బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31తో ముగియనుండడం, ప్రస్తుత సోషల్ డిస్టెన్స్ కోసం లాక్‌డౌన్ లాంటి పరిణామాలతో రవాణా శాఖకు కొత్త కష్టం వచ్చిపడినట్లయింది. మరోవైపు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి స్లాట్లను మాత్రం ఇప్పటికీ ఇస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సు కావాల్సిన వారు ఆర్టీఏ కార్యాలయాల్లో టెస్టులకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే లైసెన్స్‌ రెన్యువల్‌తో పాటు మిగతా సేవలన్నింటిని లాక్‌డౌన్ ముగిసే వరకు రద్దు చేసినట్లు వారు తెలిపారు.

Tags: corona lockdown, vehicle online registration, transport department, telangana

Advertisement

Next Story

Most Viewed