- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెయూ వివాదం.. పాలకమండలి సభ్యులకు సారీ చెప్పిన వీసీ

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులకు వీసీ రవీంద్ర గుప్తా క్షమాపణ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో విద్యాశాఖ అధికారి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి చీఫ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా మినహా మిగిలిన పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు తమపై వీసీ రవీంద్ర గుప్తా మీడియా సమక్షంలో చేసిన వాఖ్యలపై మండిపడ్డారు. చివరకు నవీన్ మిట్టల్ జోక్యం చేసుకుని వీసీ చేత పాలకమండలి సభ్యులకు సారీ చెప్పించారు.
ఇదిలా ఉంటే తెయూ పాలక మండలి సమావేశం గురించి సభ్యులకు ఒకరోజు ముందు సమాచారం ఇవ్వడంతో ఎజెండాపై చర్చలేకుండానే ముగిసింది. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, మీడియాలో వచ్చిన కథనాలు, విద్యార్థి సంఘాల రచ్చ, పాలక మండలి సభ్యులు సహకరించడం లేదని, వర్గం పేరుతో మీడియాతో వీసీ మాట్లాడిన తీరుపై చర్చ జరిగింది. రెండు గంటల పాటు జరిగిన సమావేశం కేవలం వీసీ, రిజిస్ట్రార్‌లు చేసిన నియామకాల వివాదాలపైనే జరిగింది. చివరకు నవీన్ మిట్టల్ జోక్యం చేసుకుని ఇప్పటి వరకు జరిగిన అన్ని నియామకాలను రద్దు చేస్తూ ప్రకటన రద్దు చేయాలని తేల్చిచెప్పారు. ఈసీ అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేది లేదని పాలకవర్గం తీర్మానించింది. దీంతోపాటు ఈసీ అనుమతి లేకుండానే నియమితులైన రిజిస్ట్రార్‌ను కూడా ఇన్‌చార్జీగానే వ్యవహరిస్తారని పాలకవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.
- Tags
- administration