మహిళలు మీరే నంబర్ వన్ : వరుణ్

by Shyam |
మహిళలు మీరే నంబర్ వన్ : వరుణ్
X

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్.. తన సినిమాలను ప్రమోట్ చేయడంలో చాలా కొత్తగా ఆలోచిస్తాడు. ప్రస్తుతం తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో కూలీ నెం.1 మూవీ చేస్తున్నాడు వరుణ్. మే 1న రిలీజ్ కానున్న సినిమా ప్రమోషన్స్ ఇప్పుడే మొదలెట్టేశాడు. 1995లో గోవింద హీరోగా వచ్చిన కూలీ నెం.1 సినిమాకు ఇది రీమేక్ కాగా…. ప్రచార కార్యక్రమాలు షురూ చేశాడు.

ఉమెన్స్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కొందరు మహిళా కూలీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మేము ఎవరికి తక్కువ కాదంటూ ఈ మహిళా కూలీలు ప్రూవ్ చేశారు అంటూ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వరుణ్ ధావన్ … మీరు కదా ‘కూలీ నెం. 1’ అంటూ పోస్ట్ పెట్టాడు. కూలీ నెం.1 సినిమాలో వరుణ్ ధావన్‌కు జంటగా సారా అలీఖాన్ కనిపిస్తుండగా… 90వ దశకం మెలోడీ సాంగ్స్‌తో జంటగా అలరించనున్నారు.

tags : Varun Dhawan, Coolie No.1, Bollywood

Advertisement

Next Story