విజయసాయిరెడ్డి గారూ ఏది నిజం? ఏది వైరల్ : వర్ల రామయ్య

by srinivas |   ( Updated:2020-07-22 10:01:29.0  )
విజయసాయిరెడ్డి గారూ ఏది నిజం? ఏది వైరల్ : వర్ల రామయ్య
X

దిశ, ఏపీబ్యూరో :
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా సోకడంతో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ మాధ్యమంగా.. ‘విజయ సాయి రెడ్డి గారూ.. కరోనా చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో మీరు ఉంటే, సీబీఐ అధికారులు మిమ్మిల్ని విచారణ చేసే అవకాశం వుంటుందా? విచారణ తప్పించుకోడానికి ఆస్పత్రి డ్రామా అని మీ సన్నిహితులు అంటున్నారు. ఏది నిజం, ఏది వైరల్? ఈ ఒక్క నిజం మీ నోట వినాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

అలాగే చీరాల ఘటనపై ఆయన మండిపడుతూ.. ‘మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని చీరాల పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొడితే, అతను చనిపోయాడు. మాస్క్ పెట్టుకోకపోతే చచ్చేంత కొడతారా? మరి మన రాష్ట్రంలో చాలా మంది “పెద్దలు” మాస్క్ పెట్టుకోకుండా “పరిపాలన” చేస్తున్నారు, వారిని ఏమి చేస్తారు? లాఠీలకు పని చెబుతారా, జీ హుజూర్ అంటారా?’ అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed