ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రయల్స్‌లో వరు..

by Shyam |
ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రయల్స్‌లో వరు..
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ హీరోయిన్ కమ్ విలన్ కమ్ డైరెక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ వర్కౌట్స్‌పై కాన్సంట్రేట్ చేసింది. ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకునే వరు.. తనలో ఉన్న లోపాలతో తనను తాను ప్రేమించుకోవడం, వాటిని అధిగమించేందుకు కొత్తగా నేర్చుకోవడం ఓ గొప్ప ప్రయాణమని చెబుతోంది. ఈ క్రమంలోనే తనను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్న వరు.. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది అంత సులభం కాదని చెప్తోంది. కానీ ఈ ప్రాసెస్ మీద నమ్మకం పెడితే, ముఖ్యంగా మిమ్మల్ని మీరు విశ్వసిస్తే ఏదైనా సాధ్యమేనని అంటోంది. దీనికి కావాల్సిందల్లా మంచి ఆహారం, మంచి వ్యాయామం అని చెప్తోంది. తనలో ఉన్న బెస్ట్‌ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ట్రైనర్‌కు థాంక్స్ చెప్పింది.

https://www.instagram.com/p/CISaCHWgqb2/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story