ఐశ్వర్య రాయ్‌ను కలిసిన ఆనందంలో నటి వరలక్ష్మీ ఏం చేసిందంటే..

by Shyam |
Varalaxmi-Sarathkumar
X

దిశ, సినిమా : హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్‌లతో పాటు వారి కూతురు ఆరాధ్యను కలిసినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన వరు.. లాస్ట్ నైట్ ఈ లవ్‌లీయెస్ట్ ఇన్సిడెంట్ జరిగిందని తెలిపింది.

రిచెస్ట్ ఫ్యామిలీకి చెందిన వారు చూపించిన ప్రేమ, వినయం అద్భుతమని వివరించింది. వారితో కలిసి టైమ్ స్పెండ్ చేయడం లక్కీగా ఫీల్ అవుతున్నానన్న ఆమె.. దీనికి కారణమైన తండ్రి శరత్ కుమార్‌కు ధన్యవాదాలు చెప్పింది. ఐశ్వర్య, అభిషేక్‌లను కలిసిన సిస్టర్ పూజా శరత్ కుమార్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని.. ఫ్యాన్ గర్ల్ మోమెంట్‌తో ఇంకా బయటకు రాలేకపోతుందని తెలిపింది. కాగా, ‘పొన్నియిన్ సెల్వన్ ’ షూటింగ్ కోసం చెన్నైకి చేరుకున్న ఐశ్వర్య అండ్ ఫ్యామిలీ.. శరత్ కుమార్ రిక్వెస్ట్‌తో వారి ఇంట్లో స్పెండ్ చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story