- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో నోరూరించే ఊరగాయ పచ్చడి.. ఎలా పెట్టాలో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : సమ్మర్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది నోరూరించే ఆవకాయ పచ్చడి. ఈ పచ్చడి అంటే చాలు ఎవరికైనా తమ సొంత ఊరు గుర్తు వస్తుంది. అమ్మ ప్రేమతో, ఆవకాయ పచ్చడితో రెండు ముద్దలు పెట్టినా, అది అమృతం లాగా ఉంటుంది. ప్రస్తుతం ఆవకాయ సీజన్ వచ్చేసింది. ప్రతి పల్లె, పట్నంలో అమ్మవాళ్లు ఆవకాయ పెడుతుంటారు. అయితే ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టాలి. దానికి ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
ఇవి కూడా చదవండి: కిలో కూరగాయలు రూ.85,000 మాత్రమే.. ఎక్కడో కాదు.. మన దగ్గరే!
రెండు కిలోలనర మాడికాయ ముక్కలు
500లగ్రాముల కారం
1/4 కప్ ఉప్పు
2 టేబుల్ స్పూన్ పసుపు
50 గ్రాముల మెంతులు
300ల గ్రాముల వెల్లుల్లి రెబ్బలు
1 లీటర్ నూనె
తయారీ విధానం :- ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి, పొడి బట్టతో కొంచెం కూడా తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత మామిడికాయల్ని ఒకమాదిరి ముక్కులుగా కోసి, అందులో టెంకలను తీసేసి, ఆ టెంకల కింద ఉన్న సన్నని కాగితం లాంటి పొరని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని, వాటిని పోపులోకి కొన్ని ఉండనివ్వగా, ఇంకొన్ని పేస్టులా తయారు చేసుకొవాలి. వాటితో పాటు ఆవాలను , మెంతులను వేరు వేరుగా చిన్న సెగ మీద వేడి చేసుకొని, చక్కటి వాస వచ్చేవరకు వేయించి, పొడిని పక్కన పెట్టుకోవాలి.
పచ్చడి తయారీ..
మామిడికాయలను ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి. తర్వాత వాటికి పసుపు, కారం, మెంతుల పొడి, ఆవాల పొడి, వెళ్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సగం నూనె పోసి మళ్లీ కలిపి, మూత పెట్టి రెండు రోజుల పాట ఊరనివ్వాలి. మధ్య మధ్యల కలుపుతూ ఉండాలి. రెండు రోజుల తర్వాత మిగితా సగం నూనె పోసి, మళ్లీ ఒకసారి కలిపి జాడీలోకి మార్చుకోవాలి. ఇక అంతే నోరించే ఆవకాయ పచ్చడి రెడీ.