- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరాన్ దేశ వంటకానికి ఇండియాలో యమ క్రేజ్..
దిశ, వెబ్‌డెస్క్ : స్వీట్లు అంటే ఎవరి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి ముదుసలివారి వరకు ప్రతి ఒక్కరూ స్వీట్స్‌ను ఇష్టపడతారు. అంతే కాదు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం అయినా స్వీట్స్ తప్పకుండా పెడతారు. అయితే ఎన్నిరకాల స్వీట్లు ఉన్నా కూడా వాటిలో కొన్ని స్వీట్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి స్వీట్ ఐటమే గులాబ్ జాం. గులాబ్ జాం భారతీయ వంటకాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంత ప్రత్యేకత ఉన్న స్వీట్ అసలు ఎక్కడ పుట్టింది. దానికి ఆ పేరు ఎలా వచ్చింది ఒక్కసారి తెలుసుకుందాం.
గులాబ్ జాంను మొట్ట మొదటిసారిగా మధ్యయుగాలలో ఇరాన్ దేశంలో తయారచేశారని చరిత్ర చెబుతోంది. ఇరాన్ లో తయారు చేసిన జామ్‌ను టర్కిష్ ప్రజలు భారతదేశానికి తీసుకువచ్చారు. తరువాత ఆ డిష్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రిపేర్ చేశారని చరిత్ర చెబుతుంది. అలా భారత దేశంలో వచ్చిన గులాబ్ జామ్ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఇంటిలో ప్రసిద్ది చెందింది.
ఇక గులాబ్ జామ్ పేరు ఎలా వచ్చిందంటే పెర్షియన్ భాషలో 'గుల్' అంటే పువ్వు అని 'ఆబ్' అంటే నీరు అని అర్థం వస్తుంది. అంటే గులాబీల సువాసనతో కూడిన తీపినీరళ్లు అని అర్థం. గులాబ్ జామ్‌ను నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు అవి ముదురు రంగులోకి వస్తాయి. కాబట్టి వాటిని జామ్‌తో పోలుస్తారు. అందుకే దీనికి గులాబ్ జామ్ అనే పేరు వచ్చింది.
Also Read:
బీర్ తయారు చేస్తున్న రోబోలు.. నెలరోజుల పని ఒక్కరోజులోనే పూర్తి..