16 నుంచి వందే భారత్ 2.0

by Shamantha N |
16 నుంచి వందే భారత్ 2.0
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రటించాయి. దీంతో ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లిన వలస కార్మికులు అక్కడే చిక్కిపోయారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులను తిరిగి దేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వందే భారత్ మిషన్ రెండో దశ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 149 విమానాలు ద్వారా 31 దేశాల నుంచి మన పౌరులను వెనక్కి తీసుకురాన్నాయి. ఇందుకోసం ఈ నెల 16 నుంచి 22వ తేదీల మధ్య విమానాలు బయల్దేరి వెళ్లనున్నాయి. కొత్తగా.. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, రష్యా, కజక్‌స్తాన్, ఉక్రెయిన్, కిర్గిజిస్తాన్, జార్జియా, తజికిస్తాన్, బెలారస్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, బహ్రెయిన్, అర్మేనియా, నేపాల్, నైజీరియా దేశాలకు మన విమానాలు వెళ్లనున్నాయి. వందే భారత్ 2.0 మిషన్‌లో అమెరికాకు 13 విమానాలు, యూకేకు తొమ్మిది, కెనడాకు 10, యూఏఈకి 11, సౌదీ అరేబియాకు తొమ్మిది, రష్యాకు ఆరు, ఆస్ట్రేలియాకు ఏడు విమానాలను మన దేశ పౌరుల కోసం ప్రభుత్వం పంపించనున్నట్టు సమాచారం అందింది. అలాగే, బంగ్లాదేశ్‌కు, నేపాల్‌కు ఒక్కో విమానం చొప్పున పంపించబోతున్నట్టు తెలిసింది. విదేశాల్లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం రెండు దశల్లో వందే భారత్ మిషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. వందే భారత్ 1.0లో 64 విమానాల ద్వారా 12 దేశాల నుంచి సుమారు రెండు లక్షల మంది మన పౌరులను ఇండియాకు కేంద్రం తరలించనున్నట్టు అంచనాలున్నాయి. మొదటి దశ మిషన్ ఈ నెల మధ్యలో ముగియాల్సి ఉన్నది. అలాగే, వందే భారత్ 2.0లో భాగంగా జూన్ మధ్యలో కల్లా.. దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది భారతీయులను మన దేశానికి తీసుకురాబోతున్నట్టు సమాచారం.

Advertisement

Next Story