- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆన్‌లైన్‌లో వామన్ రావు మర్డర్ కేసు చార్జిషీట్.?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లోనే కోర్టుల విచారణ ప్రక్రియ కొనసాగుతున్నందున వామన్ రావు మర్డర్ కేసు ఛార్జిషీట్ కూడా పోలీసులు ఆన్‌లైన్‌లోనే కోర్టుకు అప్ లోడ్ చేసినట్టుగా సమాచారం. ఈ విషయాన్ని రామగుండం కమిషనరేట్ పోలీసు అధికారులు మంథని కోర్టుకు కూడా ఈ మేరకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితులు వామన్ రావ్ మర్డర్ కేసులో ఎంత మేర భాగస్వామ్యం ఉందోనన్న సమగ్రమైన వివరాలను ఈ ఛార్జిషీట్‌లో పొందుపర్చినట్టు తెలుస్తోంది.
సప్లిమెంటరీ ఛార్జిషీట్..?
వామన్ రావు మర్డర్ కేసుకు సంబంధించిన ఫస్ట్ చార్జిషీట్‌ను దాఖలు చేసిన పోలీసులు దీనికి అనుబంధంగా సప్లిమెంటరీ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన సైంటిఫిక్ రిపోర్టులు పోలీసులకు ఇంకా అందనట్టుగా తెలుస్తోంది. వామన్ రావుపై దాడి జరిగిన తరువాత వీడియోలో ఆయన మాటలు ఏమిటన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో ఆ వీడియోలను ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించారు. ఈ వీడియో రిపోర్టుతో పాటు మరిన్ని నివేదికలు కూడా పోలీసులకు అందాల్సిన పరిస్థితి ఉన్నందున సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు కోర్టు అనుమతి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్ ఛార్జిషీటు హార్డ్ కాపీని రేపు లేదా ఎల్లుండి కోర్టులో అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.