వాలైంటైన్స్ డే @బ్లాక్ డే ఫర్ ఇండియా..

by Shyam |   ( Updated:2021-02-14 07:24:49.0  )
valentines day are block day
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫిబ్రవరి-14 అనగానే అందరికీ గుర్తొచ్చేది వాలైంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం). ఎంతోమంది ప్రేమికులు ఈరోజు కోసం వెయిట్ చేస్తుంటారు. నచ్చిన అమ్మాయికి లేదా అబ్బాయికి ఎలా ప్రపోస్ చేయాలని కలలు కంటుంటారు. ఇదివరకే ప్రేమలో ఉన్నవారైతే తన ప్రేయసి లేదా ప్రేమికుడికి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి, ఏవిధంగా సర్‌ప్రైజ్ చేయాలని కొన్నిరోజుల ముందు నుంచే ప్రిపేర్ అవుతుంటారు. వీరికి రాత్రింబవళ్లు అనే తేడా ఉండదు. గుడ్ మార్నింగ్ మొదలుకుని గుడ్‌నైట్ వరకు మొబైల్‌లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటూనే ప్రేమలోని మధురానుభూతిని పొందుతుంటారు. తీరా వాలైంటైన్స్ డే రోజున ప్రేమికులు కాఫీ డేలు, రెస్టారెంట్లు, బయట కలుసుకుని తమ ప్రేమను ఒకరినొకరు వ్యక్తం చేసుకుంటారు. కొందరైతే కొంచెం డిఫరెంట్‌గా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసి తమ పార్ట్‌నర్‌ను థ్రిల్ చేస్తుంటారు. మరి వాలైంటైన్స్ డే నాడే లవర్స్ మధ్య ప్రేమ ఉంటుందా? ఇతర రోజుల్లో ఉండదా అంటే ఉండొచ్చు. ఈ రోజున నచ్చిన వాళ్లకు ఇచ్చే రోజెస్, ప్రపోస్ చేసే విధానం, చూపించే అఫెక్షన్, గిఫ్ట్స్, సర్ ప్రైజెస్ వారి బంధాన్ని మరింత ధృడంగా చేస్తుందని ప్రేమికుల అపార నమ్మకం.

అసలు ఎంటీ వాలైంటైన్స్ డే..?

15వ శతాబ్దంలో రోమ్ నగరాన్ని రెండవ క్లాడియెస్ అనే రాజు పరిపాలించేవాడు. అతనిది అత్యంత క్రూరమనస్థత్వం. క్లాడియెస్ ఆర్మీ చాలా బలంగా ఉండేది. ఏ యుద్ధానికి వెళ్లినా అతనిదే విజయం. అయితే, కాలక్రమేణా ఆర్మీలో చేరేందుకు అక్కడి యువత నిరాసక్తి కనిబరిచారు. కారణం ఆర్మీలో చేరిన వారు ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండాలని నిబంధన పెట్టడమే. అప్పటికే వాలైంటైన్ అనే వ్యక్తి స్థానిక చర్చిలో బిషప్‌గా కొనసాగుతున్నాడు. రాజు పెట్టిన షరతును అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. అంతేకాకుండా, ఆర్మీలోని కొందరికి రాజుకు తెలియకుండా ప్రేమ పెళ్లిళ్లు జరిపించాడు. విషయం తెలుసుకున్న రాజు వాలైంటైన్‌ను బంధించమని ఆదేశించాడు. అనంతరం ఫిబ్రవరి-14న మరణశిక్ష అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేశాడు. ఈ క్రమంలోనే జూలియా అనే యువతి (జైలు ప్రధానాధికారి కూతురు) అప్పుడప్పుడు జైలుకు వచ్చేది. శిక్ష అనుభవిస్తున్న వాలైంటైన్‌‌తో పరిచయం ఏర్పడగా క్రమంగా అది ప్రేమకు దారితీసింది. అతన్ని రోజు కలిసేందుకు వచ్చే జూలియా (ఫిబ్రవరి-14)న మరణదండన విధిస్తారనే కారణంతో ఆ ముందు రోజు రాదు. దీంతో వాలైంటైన్ పేపర్ మీద తన సందేశాన్ని రాసి చివరలో.. ‘ఫ్రం యువర్ వాలైంటైన్’ రాసి జూలియాకు ఇవ్వమని జైలు అధికారులకు ఇస్తాడు. మరుసటి రోజు అతనికి మరణశిక్ష అమలవుతుంది. వాలైంటైన్ చనిపోయిన విషయం తెలిసుకుని అతని సమాధివద్ద.. వాలైంటైన్ పెళ్లి చేసిన ప్రేమ జంటలు వచ్చి రెడ్ రోజెస్ పెట్టి తమ సంతాపాన్ని ప్రకటించేవారు.ఈ స్టోరీ నవల రూపంలో ఫేమస్ కాగా.. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో వాలైంటైన్ మరణాన్ని అధికారింగా ప్రేమికుల దినోత్సవంగా ప్రకటించారు. అదే 17వ శతాబ్దంలో అమెరికాకు చేరడంతో ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందింది. కాగా, వాలైంటైన్‌ స్టోరీతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా ఉన్న లవర్స్ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం కొసమెరుపు.

ఫిబ్రవరి-14 ఇండియాకు బ్లాకే డేనా.. ఎందుకు?

వాలైంటైన్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు హ్యాపీగా జరుపుకుంటారు. తమలోని భావాలను నచ్చిన వారికి వ్యక్తపరిచి.. ఎదుటివారిపై తమకు ఎంత ప్రేముందో మాటల్లోనూ, గిఫ్ట్స్ రూపంలో చూపిస్తుంటారు. 2019కు ముందు వరకు దేశంలోని ప్రేమికులు ఫిబ్రవరి-14ను ఘనంగా జరుపుకునేవారు. అయితే, 14 ఫిబ్రవరి 2019న దేశం మొత్తం దుఖ: సాగరంలో మునిగిపోయింది. భారతమాత 40 మంది బిడ్డలను కోల్పోయింది. విధుల్లో భాగంగా జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై పాకిస్థాన్ ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పుల్వామాలోని నేతిపురాలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన దాడిలో ఉగ్రవాది ఆదిల్ అహ్మద్‌తో పాటు 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రగాయాల పాలయ్యారు.ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పక్కా ప్రణాళికతోనే పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తేల్చింది.ఈ ఘటనతో దేశం మొత్తం ప్రతీకార వాంఛతో రగిలిపోగా, ఫిబ్రవరి-26వ తేదీన ఇండియన్ ఆర్మీ పాక్ భూభాగంలోనికి చొచ్చుకువెళ్లి బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఉగ్రవాద బేస్ క్యాంపులే లక్ష్యంగా ఆర్మీ జరిపిన ఏయిర్ స్ట్రైక్స్‌లో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.

వాలైంటైన్స్ డే( ఫిబ్రవరి-14)రోజునే పుల్వామా దాడి జరగడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోయారు. నాటి నుంచి అమర జవాన్ల గౌరవార్థం ‘వాలైంటైన్స్ డే’ను స్వతహాగా ‘బ్లాక్ డే’గా పాటిస్తున్నారు. పుల్వామా దాడి జరిగి నేటితో రెండేళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఉగ్రవాదులు రాసిన నెత్తుటి మరకలను దేశప్రజలు మరిచిపోలేకపోతున్నారు. ఎందరో కన్నతల్లులకు కడుపుకోత మిగిల్చిన ఆ దాష్టీకానికి కన్నీటితో నివాళ్లు అర్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం వేడుకలు జరుగుతుంటే భారత్‌తో మాత్రం సోషల్ మీడియా వేదికగా అమరజవాన్లకు సంతాపం ప్రకటిస్తున్నారు. మీ త్యాగం ఊరికే పోదని.. దేశం మొత్తం మీ వెంటే ఉందని వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. ఎవరి మొబైల్ స్టేటస్ చూసినా పుల్వామా దాడి దృశ్యాలే కల్లముందు కదలాడుతున్నాయి. ఆపత్కాకాలంలో దేశానికి, జవాన్ల కుటుంబాలకు భారతీయులు ఎన్నటికీ వెన్నంటే ఉంటారని ఈ ఒక్క ఘటనతో మరోసారి రుజువైంది. పుల్వామా దాడిని కేంద్రం సీరియస్‌గా తీసుకున్నప్పటికీ ఫిబ్రవరి-14ను అధికారికంగా ‘బ్లాక్ డే’గా ప్రకటించలేదు. అయినప్పటికీ, దేశమంతా ఈ రోజును ‘ప్రేమికుల దినోత్సవం’గా కాకుండా ‘బ్లాక్ డే’గా పాటించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed