పవర్ ఫుల్‌గా ‘వకీల్ సాబ్’ ప్రమోషన్స్.. ఖర్చు తెలిస్తే షాక్?

by Shyam |
Vakeel Saab
X

దిశ, సినిమా: సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. హిందీలో సూప‌ర్ హిట్ అయిన పింక్ రీమేక్‌గా తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్‌‌కు వేణు శ్రీరామ్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా, అంజలి, నివేదా థామస్, మల్లేశం ఫేమ్ అనన్య నాగేళ్ల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఏప్రిల్ 9న విడుద‌ల కానున్న ఈ చిత్రం కోసం భారీ ప్రమోష‌న్ వర్క్స్ చేప‌ట్టేందుకు చిత్ర మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ప‌వ‌ర్ స్టార్ ఫొటోతో రూపొందించిన లైట్ బెలూన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమచారం. అయితే.. ఒక్కో బెలూన్ ఖర్చు రూ.30 వేలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా, ఏప్రిల్ 3న యూసుఫ్ గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దాదాపు కోటి వరకూ ఖ‌ర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో పాటు ఇండియ‌న్ స్టార్ హీరో ఒక‌రు వేడుక‌కు ముఖ్య అతిథులుగా వ‌స్తార‌ని ప్రచారం జ‌రుగుతోంది.

Advertisement

Next Story