‘ఉప్పెన’ హీరో రెండో సినిమా కన్‌ఫర్మ్

by Shyam |   ( Updated:2020-07-04 00:16:18.0  )
‘ఉప్పెన’ హీరో రెండో సినిమా కన్‌ఫర్మ్
X

హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్.. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సన దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ కాగా, ఏప్రిల్ 2న విడుదల కావాల్సిఉన్న ఈ సినిమా.. పక్కా హిట్ అని కన్‌ఫర్మ్ అయిపోయారు. కానీ కరోనా కారణంగా సినిమా రిలీజ్ కాస్త వాయిదా పడింది.

అయితే మొదటి సినిమా విడుదల కాకముందే వైష్ణవ్.. మరో సినిమాలో చాన్స్ కొట్టేశాడని టాక్. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఆ సినిమాను కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తాడని సమాచారం. మరోవైపు హీరోయిన్ కృతిశెట్టి కూడా వరుస చాన్స్‌లు చేజిక్కించుకుంటోంది.

Advertisement

Next Story

Most Viewed