వివాదాస్పదంగా మారిన వైకుంఠధామం..!

దిశ, బోధన్: నిర్మల్ జిల్లా రెంజల్ మండలం దండిగుట్టలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. దండిగుట్టలో సేవాలాల్ జగదాంబ మందిరం పక్కన స్మశానవాటిక నిర్మించడంపై గత ఎనిమిది నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. వైకుంఠధామం నిర్మాణ పనులను అడ్డుకునేందుకు యత్నించగా సోమవారం జరిగిన తోపులాటలో సక్రి భాయి అనే గిరిజన మహిళ స్పృహ తప్పి పడిపోగా.. రేణుక భాయి చేతికి గాయాలయ్యాయి. దీంతో దండిగుట్ట వాసులు రెంజల్ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళలు అని చూడకుండా ఉపసర్పంచ్ జగదీష్‎తో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Vaikunthdham has become controversial

Advertisement