ఒకే కేంద్రంలో 100 మందికి టీకాలు

by vinod kumar |   ( Updated:2021-01-19 10:06:33.0  )
ఒకే కేంద్రంలో 100 మందికి టీకాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ నివారణకు చేపట్టిన టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాలను పెంచారు. జిల్లాలో మంగళవారం 2319 లబ్ధిదారులను గుర్తించగా 1327 మంది టీకాలు వేశారు. గరిష్టంగా ఒక కేంద్రంలో 100 మందికి టీకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కర్పూరం హర్షవర్ధన్, ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా టీకాల పంపిణీని పర్యవేక్షించారు.

సూర్యాపేట పట్టణంలోని గిరినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలను ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందికి వేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, 6వ వార్డు కౌన్సిలర్ నీలాబాయి, JRCS చైర్ పర్సన్ కోటేశ్వరి, UPHC గిరినగర్ వైద్య అధికారులు డా.కె వెంకటేశ్వర్ రెడ్డి, డా.ప్రద్యుమ్న, యాకస్వామి, మధు, నరేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed