రేపటి నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి టీకా

by Shamantha N |
రేపటి నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి టీకా
X

న్యూఢిల్లీ: ఆసియా దేశం సింగపూర్ కౌమరదశ పిల్లలకు మంగళవారం నుంచి టీకా పంపిణీని ప్రారంభించనుంది. 12ఏళ్లు పైబడినవారికి టీకా పంపిణీ ప్రారంభించిన అతికొద్ది దేశాల జాబితాలో సింగపూర్ చేరనుంది. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ కేసులు పెరిగిన ఈ దేశంలో మహమ్మారి పిల్లల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తు్న్నది. మహమ్మారిని కట్టడి చేయడానికి టెస్టింగ్, ట్రేసింగ్‌ను ఉధృతం చేస్తున్నట్టు దేశ ప్రధానమంత్రి లీ సియేన్ లూంగ్ వివరించారు. 5.7 కోట్ల జనాభా గల ఈ దేశంలో ఇప్పటికే మూడు వంతుల ప్రజలకు కనీసం ఒక డోసైనా వేశారు. ఇక్కడ ఫైజర్, మొడెర్నా టీకాలను పంపిణీ చేస్తు్నారు. ఫైజర్ టీకా పిల్లల్లో సమర్థంగా పనిచేస్తు్న్నట్టు ఫలితాలు వెల్లడించాయి. 12ఏళ్లు పైబడిన పిల్లలకు టీకా పంపిణీని ఇప్పటికే అమెరికా, యూఏఈ, కెనడాలు మొదలుపెట్టాయి. జూన్ 7న జర్మనీ ప్రారంభించనుంది.

Advertisement

Next Story