- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారంలో అందరికీ టీకా.. కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు
దిశ, క్రైమ్ బ్యూరో : పోలీసులు అందరూ వారం రోజుల్లో టీకా వేయించుకోవాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. డిపార్ట్మెంట్‌లో హోంగార్డులతో సహా ప్రతి ఒక్కరూ
వ్యాక్సినేషన్ లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, యూనిట్ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ఇంకా టీకా తీసుకోని వారందరినీ ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించాలని ఆదేశించారు. డిపార్ట్మెంట్‌లో హోం గార్డులతో సహా ప్రతి పోలీస్ సిబ్బంది వారం రోజుల్లో 95 శాతం వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు.
వచ్చే వారంలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సీఐడీ, ఇంటిలిజెన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తదితర ప్రత్యేక యూనిట్లలో టీకాలు పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ తదితర కొవిడ్ నిబంధనలు పాటించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ రెండో వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మరోసారి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహాయ సహకారాలతో కొవిడ్ నివారణ చర్యలు ముమ్మరంగా నిర్వహించాలని తెలిపారు.