- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ట్రాన్స్‌జెండర్‌గా వాణి కపూర్?

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ చాలా పెద్ద సాహసానికి సిద్ధమైంది. హీరోయిన్ అంటే స్క్రీన్‌పై గ్లామరస్ టచ్ ఇస్తూ, కమర్షియల్‌గా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటారు. ఇక సక్సెస్ ఉన్న హీరోయిన్ అయితే, డీ గ్లామరస్ పాత్రలకు కూడా ఓకే చెప్పడం చూసుంటాం. కానీ, ట్రాన్స్‌జెండర్ పాత్ర చేసేందుకు మాత్రం ముందుకు రారు.. రాలేరు. అందుకు చాలా గట్స్ ఉండాలి కూడా. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ కెరియర్‌పై నెగెటివ్‌గా ప్రభావం చూపే అవకాశమే ఎక్కువ. అయినా సరే క్యారెక్టర్‌లో ఇంటెన్స్ ఉండటంతో… ఇప్పటి వరకు గ్లామర్ డాల్‌గా మెరిసిన వాణి కపూర్ ఇందుకు ఓకే చెప్పిందని బాలీవుడ్ టాక్.
https://www.instagram.com/p/CGmmc71j7Bt/?igshid=dx3ktf6tsgu5
అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, వాణి కపూర్ జంటగా నటిస్తున్నారు. ‘చండీఘర్ కరె ఆషికి’ పేరుతో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఇందులో లవర్ బాయ్‌గా కనిపించబోతున్న ఆయుష్.. ట్రాన్స్‌జెండర్ అయిన వాణిని ప్రేమిస్తాడని తెలుస్తోంది. అసలు అలా ఎందుకు చేస్తాడు? తర్వాత ఇద్దరూ ఎదుర్కొనే పరిణామాలు ఏంటి? అనేది కథ కాగా, వాణి కపూర్ ధైర్యానికి శభాష్ అంటున్నారు సినీ విశ్లేషకులు.