రక్షకుడు 'వర్సెస్' రాక్షసుడు

by Shyam |   ( Updated:2023-10-10 06:11:50.0  )
రక్షకుడు వర్సెస్ రాక్షసుడు
X

‘వి’ ది మూవీ టీజర్ వచ్చేసింది. అంచనాలకు మించి దుమ్ము దులిపేసింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో సుధీర్‌బాబు హీరో కాగా.. నేచురల్ స్టార్ నాని నెగెటివ్ షేడ్స్‌లో ఇరగ్గొట్టేశాడు. పోలీసు ఆఫీసర్‌గా సుధీర్‌బాబు రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తే, హై ఎండ్ కిల్లర్‌గా నాని తన సైకోయిజాన్ని ప్రదర్శించాడు. ఇది నానికి 25వ చిత్రం కాగా, నివేదా థామస్, అదితీరావు హైదరీ కథానాయికలు.

‘ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్.. అప్పుడప్పుడు నాలాంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటాడు’ అనే సుధీర్ బాబు డైలాగ్‌తో మొదలవుతుంది టీజర్. కిల్లర్‌ నానిని పట్టుకునేందుకు సుధీర్ చేసే ప్రయత్నంలో ఇద్దరికి మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడటానికి, నువ్వొస్తే విజిల్స్ వేయడానికి నేనేవీ నీ ఫ్యాన్‌ను కాదు సైకో’ అని, ‘సోదాపు, దమ్ముంటే నన్నాపు అంటూ రక్షకుడు సుధీర్‌కు సవాల్ విసురుతాడు రాక్షసుడు నాని. ఇంతకీ నాని సైకోగా ఎందుకు మారాడు? సుధీర్‌బాబు ఆ సైకో చేస్తున్న మర్డర్లను ఎలా ఆపగలిగాడు? నిందితుడిని ఎలా పట్టుకున్నాడు? అనే అంశాలతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఇచ్చేందుకు వచ్చేస్తోంది ‘వి’ మూవీ. మార్చ్ 25న ఉగాదికి రిలీజ్ కానున్న సినిమా కలెక్షన్లను దమ్ముంటే ఆపాలని ఇతర సినిమాలకు సవాల్ విసురుతోంది చిత్ర యూనిట్.

Advertisement

Next Story