ఎక్స్‌పెక్టేషన్‌కు మించిన ఎంటర్‌టైన్మెంట్ ‘వి’!

by  |
ఎక్స్‌పెక్టేషన్‌కు మించిన ఎంటర్‌టైన్మెంట్ ‘వి’!
X

నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ సినిమా ట్రైలర్.. అభిమానుల అంచనాలను మరింత పెంచింది. నానికి 25వ చిత్రమైన ‘వి’ తన విలనిజానికి 100 మార్క్స్ వేయగా.. సుధీర్ బాబు కెరియర్‌కు టర్నింగ్ పాయింట్ కానుంది. సినిమాలో సైకోగా కనిపిస్తున్న నాని.. ప్రతీ మర్డర్‌ను ‘ఎంటర్‌టైన్మెంట్ వే’లో చేస్తుంటాడు. పాపులారిటీ కోసమే సైకో ఇదంతా చేస్తున్నాడని.. తనను పట్టుకునేందుకు ట్రై చేస్తుంటాడు సుధీర్ బాబు. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్‌కు సైకో ఎలాంటి చాలెంజ్ విసిరాడు? ఇద్దరి మధ్య రివేంజ్ ఎలాంటి వాయిలెన్స్‌కు దారి తీసింది? అనేది కథ. కాగా, నాని సైడ్ బిజినెస్ మర్డర్ చేయడమైతే, మెయిన్ బిజినెస్ ఏమై ఉంటుంది? అనే ప్రశ్నలతో ట్రైలర్ పూర్తయింది. మొత్తానికి ఎక్స్‌పెక్టేషన్‌కు మ్యాచ్ అవలేదనే మాట రాకుండా ఉండేలా సినిమా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ ద్వారా మాటిచ్చాడు నాని. సుధీర్ బాబు హీరోయిజం, నాని విలనిజం ట్రైలర్‌లో హైలెట్ కాగా, సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన థ్రిల్లర్ మూవీలో అదితి పాత్ర స్పెషల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అమిత్ త్రివేది సంగీతం అందించిన చిత్రానికి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.


Next Story

Most Viewed