- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌దే: వీహెచ్

దిశ, పరిగి: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో.. దళారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సోమవారం పరిగిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని చెప్పుకుంటూ రైతుల ఉసురుతీస్తున్నారని విమర్శించారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు చేసే దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలంగాణ రైతులు ఉన్నారని గుర్తు చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రైస్ మిల్లర్లతో చేరిపోయి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పి.. వారికి సంకెళ్లు వేసి తీవ్రవాదులుగా చిత్రీకరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తామన్నారు.
- Tags
- grain purchase