వీ-గార్డ్‌కు తోడుగా ఈ-కామర్స్ విభాగం..!

by  |
వీ-గార్డ్‌కు తోడుగా ఈ-కామర్స్ విభాగం..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వీ-గార్డ్ (V-Guard) కరోనా వ్యాప్తి కారణంగా అన్ని రంగాల్లోని కంపెనీల మాదిరిగానే లాక్‌డౌన్ ప్రభావానికి లోనైంది. అయితే, గత రెండేళ్లుగా ఈ-కామర్స్ (E commerce) విభాగంలో అభివృద్ధి చేసిన ప్రణాళికలు ఈ కొవిడ్-19 సంక్షోభ కాలంలో ఉపయోగపడినట్టు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఆరు త్రైమాసికాల దిగువకు క్షీణించినప్పటికీ, ఈ-కామర్స్ విభాగం అమ్మకాలను నిలబెట్టింది. ‘ఇటీవలి కాలంలో కంపెనీ పరిస్థితి మెరుగైన స్థితిలోనే ఉంది.

ఈ-కామర్స్ విభాగంలో సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు భారీగా పెట్టుబడులను కొనసాగించామని’ వీ-గార్డ్ సీవోవో వి. రామచంద్రన్ ( v. ramchandram) తెలిపారు. ప్రస్తుతం మొత్తం కంపెనీ ఆదాయంలో ఈ-కామర్స్ విభాగం 6-8 శాతం ఆదాయ వాటాను కలిగి ఉంది. ‘డిమాండ్ కూడా గత కొద్దిరోజులుగా కోలుకుంటోంది. అన్ని రంగాల్లోని కంపెనీలకు తగిన సవాళ్లు ఉన్నాయి. ఆటంకాలు ఉన్నాయి. సరఫరా అతిపెద్ద సవాలుగా ఉన్నప్పటికీ, తమ కంపెనీ డిమాండ్ మెరుగ్గా ఉండటం కొంత ఊరట కలిగిస్తోందని, ఈ-కామర్స్ విభాగం వృద్ధి సాధించడమే కాకుండా అంతే స్థాయిలో కొనసాగుతోంది’ అని వీ-గార్డ్ సీఎఫ్‌వో సుదర్శన్ కస్తూరి (Sudarshan kasturi) చెప్పారు.

అలాగే, కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికల నుంచి స్వల్పకాలిక ప్రణాళికలకు మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తులను ప్రారంభించేందుకు ఇది అనువుగా ఉంటుంది. ఇటీవల కంపెనీ చిన్న చిన్న కిచెన్ ఉపకరణాలను, వాటర్ ప్యూరిఫయర్‌లను ప్రారంభించింది. ప్రజలు ఇంటిపట్టునే ఉన్నందున ఈ ఎలక్ట్రికల్ ఉపకరణాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నాయి. అంతేకాకుండా, వీ-గార్డ్ సంస్థ ఉత్తర భారత మార్కెట్లో విస్తరించే ప్రణాళికపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉత్తర, దక్షిణ భారత మార్కెట్లు రెండూ అమ్మకాల్లో 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రానున్న 3-4 ఏళ్లలో మిగిలిన మార్కెట్లను కూడా దక్షిణ భారత మార్కెట్ స్థాయిలో లాభాలను ఆర్జించే దిశగా చేరుకుంటామని రామచంద్రన్ తెలిపారు. తాజాగా వాటర్ హీటర్ల వంటి వాతావరణ సంబంధిత ఉత్పత్తులపై కూడా సంస్థ దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వీ-గార్డ్ ఆదాయం 42 శాతం క్షీణించి రూ. 4.8 కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం వల్లే ఆదాయం క్షీణించినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.



Next Story

Most Viewed