‘వి’ డిజిటల్ ప్రమోషన్స్ అదుర్స్

by  |
‘వి’ డిజిటల్ ప్రమోషన్స్ అదుర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని ‘వి’ సినిమా త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయబోతోంది. సుధీర్ బాబు పోలీస్‌గా కనిపించనున్న చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్న సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తుండగా.. ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌ను ట్రైలర్ లాంచ్‌లో భాగం చేస్తూనే.. సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తోంది.

ఇందులో భాగంగా ‘వి ఫర్ విక్టరీ’ సైన్‌తో సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేసిన హీరో, హీరోయిన్లు.. తమతో కలిసి ‘వి’ ట్రైలర్ లాంచ్ చేయాలనుకుంటే.. విక్టరీ సైన్‌తో ఫొటోలు దిగి.. #VTrailerOnPrime హాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. అప్పుడు మీకో సర్‌ప్రైజ్ వస్తుందని చెప్పారు.

దీంతో సోషల్ మీడియాలో # VTrailerOnPrime ట్రెండింగ్‌లో ఉండగా.. డిజిటల్ ప్రమోషన్స్ సూపర్ అంటున్నారు నెటిజన్స్.



Next Story