సచివాలయంలోకి జర్నలిస్ట్‌లకు నో ఎంట్రీ

దిశ వెబ్ డెస్క్: సచివాలయంలోకి జర్నలిస్టులకు నోఎంట్రీ అని ఉత్తరఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలోకి మీడియాకు అనుమతించడం లేదని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సచివాలయం వద్ద ఉన్న మీడియా కేంద్రానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5వరకు జర్నలిస్టులకు అనుమతించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. జర్నలిస్టులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వివరించింది.

Advertisement