కేటీఆర్‌పై ఉత్తమ్‌ ప్రశంసలు

by  |
కేటీఆర్‌పై ఉత్తమ్‌ ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంతా పరిస్థితులు ఉన్నాయి. ఆరేళ్ల నుంచి ఒకరిపై ఒకరు ఒంటికాలిపై లేస్తూ మాటకు మాట అనుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఏ సభకు, సమావేశానికి వెళ్లినా దుమ్మెత్తి పోసుకుంటారు. కానీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేలా మాట్లాటారు. కేటీఆర్ డైనమిక్ మినిస్టర్ అంటూ కామెంట్లు చేస్తూ సభలో ఉన్న జనాలు ఖుషీ అయ్యేలా మాట్లాడారు. దీంతో జనాలంతా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ డైనమిక్ లీడర్ అంటూ వ్యాఖ్యానించారు.

గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఇటీవల నల్గొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మధ్య ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి అంశాలపై మాటకు మాట పెరిగి తిట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఉత్తమ్‌కుమార్ ఘాటు విమర్శలు చేశారు. కానీ నెల రోజుల వ్యవధిలోనే హుజూర్‌నగర్‌ పర్యటనలో జగదీశ్‌రెడ్డి సమక్షంలోనే కేసీఆర్‌ తనయుడు అయిన కేటీఆర్‌ను డైనమిక్ మినిస్టర్ అంటూ ఉత్తమ్ కుమార్ పొగడటంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed