పారిశుద్ద్య కార్మికులను సన్మానించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Sridhar Babu |
పారిశుద్ద్య కార్మికులను సన్మానించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ నల్గొండ: లాక్‌డౌన్ నేప‌థ్యంలో పారిశుద్ద్య సిబ్బంది నిరంత‌రం చేస్తున్న సేవ‌లు వెల క‌ట్ట‌లేనివ‌ని టీపీసీసీ అద్య‌క్షులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శ‌నివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో.. న‌ల్గొండ పుర‌పాల‌క సిబ్బందికి ఆయ‌న ఘ‌నంగా స‌న్మానం చేశారు. పారిశుద్ద్య కార్మికులు చేస్తున్న సేవ‌ల‌కు స‌లాం చేస్తున్నాన‌ని.. దోసిళ్ల నిండ పువ్వులు తీసుకొని వారిపై చ‌ల్లి న‌మ‌స్క‌రించారు. ఆ త‌రువాత జిల్లా కేంద్రంలో ప‌ని చేస్తున్న వైద్యులను స‌న్మానించారు.

Tags: Uttam Kumar Reddy, honors, sanitation workers, nalgonda



Next Story

Most Viewed