సామాజిక న్యాయమే మా పార్టీ విధానం..

by Shyam |
సామాజిక న్యాయమే మా పార్టీ విధానం..
X

సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ విధానమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రిజర్వేషన్ల పేరుతో సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లను 12శాతం పెంచుతామన్నకేసీఆర్ మాట తప్పారని, పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఏనాడు రిజర్వేషన్లపై గొంతెత్తక పోవడం శోచనీయమన్నారు. దళితున్నిసీఎం చేస్తానన్న కేసీఆర్ కనీసం తన కేబినెట్‌లో ఒక్క దళితునికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని దుయ్యబట్టారు. గతంలో ఎన్టీఆర్ ఏ కమిషన్ వేయకుండానే గిరిజనులకు 5 నుంచి 6 శాతం రిజర్వేషన్లు పెంచారని ఉత్తమ్ గుర్తుచేశారు. జనాభా ఆధారంగా గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. .. కాంగ్రెస్ అన్ని వేళలా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంపై గిరిజన, మైనార్టీ వర్గాలు ఆందోళనలో ఉన్నాయని ఉత్తమ్ వివరించారు. కాంగ్రెస్ పోరాటం వల్లే ఐఐటీ, ఐఐఎంలో రిజర్వేషన్లు వచ్చాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్నికాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story