కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి : మునుగోడు ఎమ్మెల్యే

by Sridhar Babu |   ( Updated:2021-11-01 06:05:38.0  )
కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి : మునుగోడు ఎమ్మెల్యే
X

దిశ, మునుగోడు: రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మునుగోడు చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , మునుగోడు ఎంపీ కర్నాటి స్వామి యాదవ్ , తహాశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో యాకూబ్ నాయక్, క్రిష్టపురం ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, సర్పంచులు మిర్యాల వెంకన్న, పంతంగి పద్మ స్వామి, జక్కలి శ్రీను, వంటెపాక జగన్, నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పొలాగోని సైదులు గౌడ్, బొడ్డు నాగరాజు, పుట్ట శ్రీనివాస్ రెడ్డి , పందుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story