ఎంఈవోల అధికారాలపై స్పష్టత ఇవ్వండి: యూటీఎఫ్

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: ఎంఈవోల అధికారాలలో కొన్నింటిని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు బదిలీ చేసి 6నెలలు గడిచినప్పటికీ వాటిపై స్పష్టత కరువైందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) ఆవేదన వ్యకం చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ గందరగోళం నివారించాలంటే ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంఈవోల అధికారాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల వేతనాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులే క్లెయిం చేసి ఉపాధ్యాయులకు చెల్లించనున్నారని, అయితే ఈ ఆదేశాలు అమలుచేసే సమయంలో సందేహాలు తలెత్తుతున్నందున వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed