యూటీఎఫ్ నాయకుడు విద్యాసాగర్ మృతి

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన యూటీఎఫ్ సీనియర్ నాయకులు, మాజీ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు కోలా విద్యాసాగర్(60) అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మరణవార్త తెలిసిన సీపీఐ(ఎం) నాయకులు నెమ్మది వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించి, మృతదేహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని విద్యారంగా సమస్యలపై విద్యాసాగర్‌రావు అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల్లో కీలక భూమిక పోషించారని తెలిపారు. అనంతరం యూటీఎఫ్‌లో కీలకమైన నాయకుడిగా పని చేసి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారని అన్నారు.

Advertisement