మీ తెలివి తేటలు కరోనాను తరమేయడానికి ఉపయోగించండి: సుజనా

by srinivas |
మీ తెలివి తేటలు కరోనాను తరమేయడానికి ఉపయోగించండి: సుజనా
X

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను లక్ష్యంగా చేసుకుని, 20 కోట్లకు టీడీపీకి అమ్ముడు పోయారని, దానికి బ్రోకర్‌గా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యవహరించారంటూ తీవ్రవ్యాఖ్యలు చేయడంపై సుజనా మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, నిన్న తన మిత్రులు తనకు ఫోన్ చేసి… కుక్కలు మీపై మళ్లీ మొరుగుతున్నాయని చెప్పారని సుజనా అన్నారు. ఏం జరిగిందోనని ఆరా తీస్తే… కన్నా గారితో పాటు తనపై విజయసాయి అవాకులు, చెవాకులు పేలాడని తెలిసిందని… అయితే, తాను ఇలాంటి నేలబారు జీవుల మొరుగుడు పట్టించుకోనని తెలిపారు. కరోనా కిట్ల కమిషన్లను దండుకోవడానికి కాకుండా, కరోనాను తరిమేయడానికి మీ తెలివితేటలను ఉపయోగిస్తే బాగుంటుందని విజయసాయికి సుజనా చౌదరి హితవు పలికారు.

Tags: ysrcp, bjp, sujana chowdary, vijayasai reddy, ap, mps



Next Story

Most Viewed