సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోండి : దువ్వూరి సుబ్బారావు

by Harish |
సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోండి : దువ్వూరి సుబ్బారావు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని ఆర్థిక సంస్కరణలను అమలు చేసే అవకాశంగా ఉపయోగించుకోవాలని, ఈ ‘సంక్షోభ సమయాన్ని వృధా చేయొద్దని’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు. నిర్మలా సీతారామన్ ఎదుర్కొన్న అవరోధాలు ప్రత్యేకమైనవని, ఇదివరకూ ఎవరు ఎదుర్కొనలేదని ఆయన తెలిపారు. గతంలో అవరోధాల సమయంలో ఆర్థిక మంత్రులకు ఖర్చు చేయకూడదని సూచించినట్టు, ప్రస్తుత పరిస్థితి వేరని, సీతారామన్ ‘ఎక్కువ ఖర్చు చేయాలని’ చెప్పారు. మాజీ ఆర్‌బీఐ గవర్నర్ ఆర్థిక మంత్రికి రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకటి వినియోగాన్ని పెంచడం లేదా ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదొక అవకాశాన్ని ఉపయోగించాలని, పక్షపాత ధోరణి ఇప్పుడు చెల్లదని స్పష్టం చేశారు. దీంతోపాటు ఆర్థికమంత్రికి పలు సూచనలు చేశారు. ఈ ఏడాదిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం తెలివైన నిర్ణయమన్నారు. దీన్ని ఇలాగే కొనసాగించాలన్నారు. వినియోగాన్ని పెంచేందుకు ఉద్యోగాలు, ఆదాయాలను అందించే ఉత్పత్తిని ప్రోత్సాహించాలన్నారు. అలాగే, ‘రుణాలు-ఖర్చు’ కార్యక్రమం ఆర్థికంగా స్థిరమైనదేనని, అదే సమయంలో ఇదే అతిపెద్ద సవాలని దువ్వూరి సుబ్బారావు చెప్పారు. దీనికోసం ఆదాయ లోటును పునరుత్థానం చేసేందుకు ప్రయత్నించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed