మోడీ నాకు మంచి మిత్రుడు : ట్రంప్

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… భారత ప్రధాని నరేంద్ర మోడీ నాకు మంచి మిత్రుడు అన్నారు. దీని కారణంగా ప్రవాస భారతీయులందరూ నాకే ఓటేస్తారని తెలిపారు. చైనా-భారత్ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదంలో మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అంతేగాకుండా భారత్-చైనా కోరితే సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మా మద్దతు ఎప్పుడూ భారత్‌కే ఉంటుందన్నారు.

Advertisement