- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలు’
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలు సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయంగా చర్చకు వచ్చిన నేపథ్యంలో జో బైడెన్ సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన అమెరికా ప్రభుత్వమూ స్పందించింది. శాంతియుత నిరసనలే సిసలైన ప్రజాస్వామ్యానికి ప్రతీకలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అన్నదాతల ఆందోళనలపై కామెంట్ చేసింది. భారత సుప్రీంకోర్టూ ఇదే వ్యాఖ్యలను ఉద్ఘాటించిందని పేర్కొంది. భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఆత్మవంటిదని, ఇంటర్నెట్ సేవలూ అందులో భాగమేనని వివరించింది. సమస్య ఏదైనా చర్చ ద్వారా పరిష్కరించుకోవచ్చునని, అమెరికా ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే పద్ధతిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. సమాచారాన్ని చేరవేసే లేదా పంచుకునే మార్గాలకు ఆటంకాలు కలిగించడం ప్రజాస్వామ్యానికి తగదని, ఇంటర్నెట్ సేవలూ అదే కోవలోకి వస్తాయని పరోక్షంగా భారత కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అలాగే, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే చర్యలను సాధారణంగానే అమెరికా ఆహ్వానిస్తుందని వివరించింది. భారత మార్కెట్లను మెరుగుపరిచే, ప్రైవేటురంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించే చర్యలకు అమెరికా సాధారణంగా మద్దతుపలుకుతుందని కేంద్రం తెచ్చిన మూడు నూతన సాగు చట్టాలపై పరోక్షంగా స్పందించింది.
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్ సేవలను నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం రైతుల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నదని విమర్శకులు నిరసిస్తున్నారు. రైతుతో 11 సార్లు కేంద్ర మంత్రులు సమావేశమైనా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా మరోమారు చర్చల ప్రస్తావన తెచ్చింది. రైతుల ఆందోళనలపై పాప్ స్టార్ రిహానా, యువ పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బెర్గ్, ఇతర సెలెబ్రిటీలు, ప్రముఖుు స్పందించడంతో ట్విట్టర్‌లో అంతర్జాతీయంగా పెద్దఎత్తున చర్చ జరిగింది. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. వాస్తవ అవాస్తవాలు తెలుసుకోకుండా సంచలన ప్రకటనలకు పోవద్దని హెచ్చరించింది.