- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై అమెరికా హెచ్చరికలు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న వేళ కోవిడ్-19 వ్యాధి చికిత్సలో మలేరియా డ్రగ్ అయిన హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు సత్ఫలితాలిస్తున్నాయని ప్రచారం జరిగింది. పలు దేశాల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లను ఇతర మందుల కాంబినేషన్లో ఇస్తూ రోగులకు ఉపశమనం కలిగించారు. ఇండియా దగ్గర భారీ నిల్వలు ఉండటంతో అమెరికా సహా పలు దేశాలు ఈ మాత్రలను దిగుమతి చేసుకున్నాయి. అయితే తాజాగా అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) సంచలన విషయాలు వెల్లడించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల ‘సైడ్ ఎఫెక్ట్స్’ ఉంటాయని హెచ్చరించింది. ఈ మాత్రలను వాడటం వల్ల గుండెకు సంబంధించిన తీవ్ర సమస్యలు ఏర్పడతాయని.. రోగికి ఉన్న రోగం తగ్గకపోగా మరింత ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఎఫ్‌డీఏ చెబుతోంది. అంతే కాదు ఈ ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ మాత్రల ప్యాకింగ్ మీద రాసి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోంది. కాగా, ఈ మాత్రలను డాక్టర్ల పర్యవేక్షణ మధ్య, ఆసుపత్రిలో ఉపయోగించి ఎప్పటికప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకుంటూ పోతే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పింది. కాని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా పేషెంట్ల అందిరినీ వ్యక్తిగతంగా ప్రతీ క్షణం పర్యవేక్షించడం కష్టం. కాబట్టి రోగ తీవ్రత ఎక్కువ ఉన్న వారికి ఈ డ్రగ్ వాడటం మంచిదని ఎఫ్‌డీఏ చెబుతోంది. కరోనాపై పోరాడే సమర్థవంతమైన ఔషధం, వ్యాక్సిన్ రూపొందే వరకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వాడక త్పదని.. కాకపోతే చాలా జాగ్రత్తగా వాడాలని చెప్పింది. అమెరికాలో ఈ ఔషధాన్ని చాలా అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని ఎఫ్‌డీఏ ఆదేశించింది. కోవిడ్-19 రోగులకు మాత్రమే వాడాలని.. ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డ్రగ్ ఇవ్వొద్దని వైద్యులకు సూచనలు చేసింది.
Tags : Hydroxychloroquine, FDA, America, Doctors, Coronavirus, Covid-19