జియోలో 9 శాతం వాటా కోసం మరో అమెరికా కంపెనీ!

by Harish |
JIO Mobile Network
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో అమెరికాకు చెందిన కంపెనీ వాటా కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన టీపీజీ క్యాపిటల్-రిలయన్స్ మధ్య పెట్టుబడుల గురించి చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. టీపీజీ క్యాపిటల్ ఇదివరకు పలు బడా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఉబర్, ఎయిర్‌ బీఎన్‌బీ, సర్వేమంకీ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసింది. జియోలో వాటా కొనుగోలుకు సంబంధించి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రావొచ్చునని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై టీపీజీ క్యాపిటల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించాల్సి ఉంది. జియో ప్లాట్‌ఫాంలోకి ఇప్పటి వరకు రూ.97,885.65 కోట్లు పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. ఏడు వారాల్లో 8 కంపెనీలు 21 శాతం వాటాను సాధించాయి. ఫేస్‌బుక్‌తో సహా సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదాల, సిల్వర్ లేక్ (రెండోసారి), ఏడీఏఐలు పెట్టుబడులౌ పెట్టాయి. టీపీజీ కంపెనీ హెల్త్ కేర్, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ వంటి రంగాల్లో 2000 సంవత్సరం నుంచి ఇండియాలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ఈ ఏఢాది ఫిబ్రవరిలో టీపీజీకి చెందిన టీపీజీ క్యాపిటల్ ఏషియా-VII 4.6 బిలియన్ డాలర్లు సమీకరించగలిగింది. ఇదిలా ఉండగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే 21 శాతం వాటాను విక్రయించిన రిలయన్స్ కంపెనీ మరో 9 శాతం విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story