భారత్‌లో ఆర్అండ్‌డీ కోసం పెట్టుబడులు పెట్టే యోచనలో అమెరికా కంపెనీ

by Harish |
US-based Molekule plans investment for R&D in India
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్-ప్యూరిఫికేషన్ టెక్నాలజీ సంస్థ మొలెకులె భారత్‌లో ఆర్అండ్‌డీ ఏర్పాటు కోసం పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కంపెనీ పరిశోధనా బృందం భారత్‌లో దిగ్గజ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్య చర్చలు జరుపుతోందని మొలెకులె సహ-వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు దిలీప్ గోస్వామి చెప్పారు. వాయు కాలుష్యానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు పరిశోధనల నుంచి శాస్తీయ ఆవిష్కరణలను నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు.

భారత్‌లో జస్‌ప్రీత్ నేతృత్వంలో సంస్థ పరిశోధనా బృందం భారత్‌లోని దిగ్గజ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంటారని దిలీప్ తెలిపారు. అంతర్జాతీయంగా కాలుష్యాన్ని నివారిస్తూ పరిశుభ్రమైన విజ్ఞానాన్ని కొనసాగించేందుకు, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చే లక్ష్యంతో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ముందుగా తమ ఉత్పత్తులను ప్రజలకు చేరువచేసే ప్రయత్నం చేస్తామని, అనంతరం ఎదురయ్యే పరిష్కారాలను అధిగమిస్తూ స్థానిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయనున్నట్టు దిలీప్ గోస్వామి వెల్లడించారు.

Advertisement

Next Story