ఆదిపురుష్‌లో ఊర్వశి పాత్రపై క్లారిటీ..

దిశ, వెబ్‌డెస్క్ :
డార్లింగ్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా అనౌన్స్‌‌మెంట్‌తో.. దేశమంతా ఓ గొప్ప సినిమా రాబోతుందని సంబరపడింది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తుండగా.. రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్‌ల పేర్లు ప్రకటించారు. అయితే, ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా సీతగా నటించబోతుందని.. ఇప్పటికే ఫిల్మ్ మేకర్స్ తనను సంప్రదించారని వార్తలు వెలువడ్డాయి.

దీంతో ఈ ఫేక్ న్యూస్‌పై స్పందించారు మేకర్స్. ఊర్వశి ఆదిపురుష్‌లో నటిస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కేవలం ప్రభాస్, సైఫ్‌లను మాత్రమే ఫైనల్ చేశామని.. ఇంకా ఎలాంటి ‘కాస్ట్ అండ్ క్రూ’ను ఎంచుకోలేదని తెలిపారు. ఏదైనా అప్‌డేట్ ఉంటే అధికారికంగా మేమే ప్రకటిస్తామని.. అప్పటి వరకు ఇలాంటి న్యూస్ ప్రచారం చేయరాదని కోరారు. సీత పాత్రతో సహా అన్ని పాత్రల గురించి ప్రత్యేక ప్రకటన ఉంటుందని.. అప్పటి వరకు వెయిట్ చేయాలని కోరారు. ప్రజలు ఇలాంటి రూమర్స్ నమ్మరాదని సూచించారు.

కాగా ఊర్వశి.. ‘సింగ్ సాబ్ ది గ్రేట్, గ్రేట్ గ్రాండ్ మస్తి, హేట్ స్టోరీ 4, రేస్ 3’ చిత్రాలతో గుర్తింపు పొందింది. వర్జిన్ భానుప్రియ చిత్రంలో చివరిసారిగా కనిపించిన ఊర్వశి.. హాట్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది.

Advertisement