- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముప్పు ఇంకా ముగిసిపోలేదు: ప్రధాని
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ ప్రమాదకరంగా ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. కాగా, ఈ పంద్రాగస్టున ప్రతిఒక్కరు ఈ మహమ్మారి నుంచి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందడానికి శపథం తీసుకోవాలని కోరారు. అదే విధంగా స్వావలంబన భారత్ కోసం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, బోధించడానికి తీర్మానించుకోవాలని జాతిని అభ్యర్థించారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవాలను ఈ సారి ఆంక్షల మధ్యనే నిర్వహించుకుంటున్నామని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్గిల్ యోధులను స్మరించారు. 21 ఏళ్ల కింద భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం పొందిందని గుర్తుచేశారు. పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి భారత్ ప్రయత్నించిందని, కానీ, దాయాది దేశం వెన్నుపోటు పొడించిందని అన్నారు.
కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ కనీవినీ ఎరుగని ధైర్యసాహసాలను ప్రదర్శించారని చెబుతూ ఆర్మీని కీర్తించారు. నేడు యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే జరగడం లేదని, దేశంలోపలా జరుగుతున్నాయని కరోనాను పేర్కొన్నారు. ప్రస్తుతం మన దేశంలో రికవరీరేటు మిగతా దేశాల కన్నా ఎంతో మెరుగ్గా ఉన్నదని, అయినప్పటికీ ఈ ముప్పు ఇంకా ముగిసిపోనందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మాస్కు ధరించి విసుగుచెందినవారు కరోనా యోధులను ఓసారి చూడాలని సూచించారు.