- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ లో ‘ఉప్పెన’ ఊపేస్తోంది…
దిశ, వెబ్ డెస్క్: మరో మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉప్పెన. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి అభిమానులను ఆకర్షిస్తూ వచ్చింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని భావించారు. దానికి తగ్గట్లుగానే సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా మళ్లీ ఎప్పుడో విడుదల అవుతుందో తెలియదు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే తన క్యూట్ లుక్స్ తో యువత మనసును ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా అందులోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట యూట్యూబ్ లో దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
విడుదలకు ముందే సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసేవి పాటలే. సినిమాలో పాటలు హిట్ అయితే.. సినిమా సగం విజయం సాధించినట్లేనని దర్శక, నిర్మాతలు భావిస్తారు. ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు విజయాలు తెచ్చిపెట్టినవే పాటలే. ఆర్ ఎక్స్ 100, హుషారు చిత్రాలను అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో.. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని మూడు పాటలు 100 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాయి. పాటలు హిట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రేక్షకుల అనుకున్నట్లే సినిమా మంచి విజయం అందుకుంది. ఇక ఆ పాటల తర్వాత యూ ట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న పాటగా ఉప్పెన లోని ‘నీ కన్ను నీలి సముద్రం’ చెప్పుకోవచ్చు. అతి తక్కువ కాలంలో 50 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని.. ఈ పాట రికార్డు కొట్టింది. ఈ పాటలో హీరో, హీరోయిన్ల హావభావాలు యువ హృదయాలను ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ పాటకు ఉన్న క్రేజ్ బట్టి మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీమణి, రఖీబ్ అలమ్ సాహిత్యం అందించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా, జావెద్ అలీ ఈ పాట పాడారు. ఈ సినిమాలోని రెండో పాట ‘ధక్ ధక్ ధక్’ పాటకు 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. . విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. లాక్‌డౌన్ ముగిసిన తరువాత మూడో పాట విడుదలవుతుందని దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా విడుదలకు ముందే పాటలతో అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమాపై విజయ్ సేతుపతి కూడా ఓ ఇంటర్యూలో చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ఉప్పెన చాలా బావుంటుందని, ఈ సినిమా తన 96’ చిత్రం కంటే బావుంటుందని సేతుపతి అనడంతో సినిమాపై ప్రేక్షకులో ఆసక్తి నెలకొంది.