- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డు గరిష్ఠానికి జూన్ యూపీఐ లావాదేవీలు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ మహమ్మారి పరిస్థితుల నుంచి భారత్ నెమ్మదిగా బయటపడుతోంది. జూన్ నెలలో నెలవారీ యూపీఐ లావాదేవీలు ఆల్‌టైమ్ హైగా నమోదయ్యాయి. చివరిగా ఈ ఏడాదిలో మార్చిలో అత్యధికంగా నమోదైన యూపీఐ లావాదేవీలు, ఏప్రిల్-మే నెలల్లో సెకెండ్ వేవ్ కారణంగా దారుణంగా పడిపోయాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ నెలలో రూ. 5,47,373 కోట్ల విలువైన 280 లావాదేవీలు జరిగాయి. ఇది మే నెలతో పోలిస్తే విలువ పరంగా 11.6 శాతం, సంఖ్య పరంగా 10.56 శాతం వృద్ధి.
మేలో మొత్తం 253 కోట్ల లావాదేవీలకు గానూ రూ. 4,90,638 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వృద్ధిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. మేలో కరోన సంబంధిత పరిణామాల తర్వాత వ్యాపార కార్యకలాపాల్లో పునరుద్ధరణ ఈ వృద్ధి సాక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో నెలకు 300 కోట్ల యూపీఐ లావాదేవీలు రోజుకు సగటున 10 కోట్ల లావాదేవీలను త్వరలో జరుగుతాయని వారు అంచనా వేస్తున్నారు.