ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు -టీటీడీ తీర్మానం 

by  |
ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు -టీటీడీ తీర్మానం 
X

దిశ, ఏపీ బ్యూరో : కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా సెప్టెంబరు 19 నుంచి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన మండలి సమావేశం జరిగింది. సమావేశంలో చేసిన తీర్మానాలను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఈఏడాది అధికమాసం కారణంగా రెండోసారి అక్టోబరులో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలో ముంబై, జమ్మూ, వారణాసిలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. ప్రధానంగా టీటీడీ ఆదాయం పెంచేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై, కార్పస్ ఫండ్స్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.

తిరుపతి బర్డ్ ప్రాంగణంలో చిన్న‌ పిల్లల ఆస్పత్రి, రూ.4.95 కోట్లతో వైజాగ్ శ్రీవారి ఆలయానికి ఘాట్ రోడ్లు నిర్మిస్తామన్నారు. ఉదయస్తమాన సేవలు బుక్ చేసుకున్న భక్తులకు విఐపి బ్రేక్ సేవ‌ కల్పిస్తామని చెప్పారు. వ్యర్థాల నుంచి కంపోష్టు ఎరువులను తయారు చేసి రైతులకు ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

బంగారం, నగదు డిపాజిట్లకు సంబంధించి ప్రతినెలా అధిక వడ్డీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో శనివారం నుంచి మూడు వేల ఉచిత దర్శన టోకెన్ల జారీని తిరిగి‌ ప్రారంభిస్తున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆన్లైన్ లో సర్వదర్శనం టోకెన్ల జారీకి కసరత్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.



Next Story