- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీ ఫార్మసీ విద్యార్థిని రేప్ కేసు : మమ్మల్ని ఎన్ కౌంటర్ చేస్తే ఎలా.. అందుకే

దిశ,వెబ్‌డెస్క్:ఘట్కేసర్ ప్రాంతంలో బీ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసు విచారణలో మరిన్ని దారుణాలు బయటపడ్డాయి. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా భాస్కర్, రమేష్, ఆటో డ్రైవర్ రాజు, శివలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో యువతికి మత్తుమందు ఇచ్చి వ్యాన్ లో అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ముందస్తు ప్లాన్‌లో భాగంగా అత్యాచారం తర్వాత యువతిని చంపేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో పోలీసు వాహనాల సైరన్ లు విని ఎన్ కౌంటర్ చేస్తారని భయపడి.. యువతిని వ్యాన్ నుంచి దించి చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ దారుణం కంటే ముందే గతంలోనూ అనేకసార్లు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు మృగాళ్లపై కిడ్నాప్, రేప్ బెదిరింపులకు సంబంధించిన కేసులు నమోదు చేశారు.