కరోనాతో యూపీ మంత్రి మృతి

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ వదలడంలేదు. దాని కోరలకు చిక్కి మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి కమల రాణి మృతిచెందారు. 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమె కరోనా టెస్టులు చేయించుకోగా జూలై 18న ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె అప్పటి నుంచి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంది. ఆదివారం ఉదయం ఆమె మృతిచెందింది. కాగా, దేశంలో పలువురు రాజకీయ నాయకులు కరోనా సోకి మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement