- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యూపీలో మరో వింత పథకం.. వాటి కోసం ఏకంగా..

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కొంచెం వింతైన పథకాలు ప్రవేశ పెట్టాలి అనుకుంటే మొదటి స్థానంలో ఉత్తర ప్రదేశ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే ఇంకో కొత్త పథకం తీసుకు వచ్చింది. ఇంత కాలం చాలా రాష్ట్రాల్లో మనం మనుషుల కోసం అంబులెన్స్ లు చూశాం. కానీ యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆవుల కోసం అంబులెన్సులు తీసుకురాబోతోంది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆవులను తక్షణం ఆస్పత్రులకు చేర్చేందుకే ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్టు రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి, పశు సంవర్థక, మత్సశాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి తెలిపారు.
ఇది దేశంలోనే చాలా గొప్ప పథకం అని కితాబిచ్చుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి అంబులెన్సులు 515 అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించారు. ఎమర్జెన్సీ నెంబర్ 112 కు ఫొన్ చేసి సమాచారం అందిస్తే చాలు 20 నిముషాల్లో చేరుకుంటుందని తెలిపారు. ప్రతి అంబులెన్స్ లో ఒక వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులు అందుబాటులో ఉంటారు. అయితే ఈ పథకం డిసెంబర్ లో ప్రారంభిస్తామని ప్రకటించారు.