నాలుగు రోజుల్లో ‘సీఎం’ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్..

by Shamantha N |   ( Updated:2021-05-04 05:42:34.0  )
నాలుగు రోజుల్లో ‘సీఎం’ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను చంపేస్తామ‌ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి.. యూపీ పోలీసుల‌కు సంబంధించిన వాట్సాప్ ఎమ‌ర్జెన్సీ డ‌య‌ల్ నెంబ‌ర్ 112 కు ఈ హెచ్చరికలు వచ్చినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కాల్స్‌లో సీఎం యోగికి మ‌రో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయ్.. ఆయనకు మరణం తప్పదు అని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక నిఘా టీంను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెంబ‌ర్‌ను ట్రేస్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రయ‌త్నిస్తున్నారు. గతంలోనూ యోగి ఆదిత్యానాథ్‌కు ప‌లుమార్లు ఇలాంటి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి.

Advertisement

Next Story

Most Viewed