బాలయ్య – రాజమౌళి కాంబినేషన్‌పై చర్చ.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by  |   ( Updated:2023-08-11 06:01:04.0  )
Balakrishna
X

దిశ, సినిమా : వెండితెరపై భారీ డైలాగ్స్‌తో విరుచుకుపడే బాలయ్య, ఇప్పుడు బుల్లితెరపైనా సత్తా చాటుతున్నారు. ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ పేరుతో ‘ఆహా’ ప్లాట్‌ఫ్లామ్‌పై టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేయగా.. రీసెంట్‌గా స్టార్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘నాతో సినిమా చేయమని అభిమానులు అడిగితే, హ్యాండిల్‌ చేయలేను’ అని తప్పించుకున్నారట ఎందుకు? అని రాజమౌళిని ప్రశ్నించాడు బాలయ్య. దీనిపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న.. ‘భయంతోనే అలా అన్నాను. ఒకవేళ మిమ్మల్ని డైరెక్ట్‌ చేయాల్సి వస్తే, మీ కోపాన్ని తట్టుకోగలనా అన్నదే నాకు పెద్ద టెన్షన్’ అన్నారు.

ఇక చివర్లో ‘మీతో సినిమా చేస్తే హీరోకు, ఇండస్ట్రీకి హిట్‌ ఇస్తారు. కానీ ఆ హీరో తర్వాతి రెండు, మూడు సినిమాలు ఫసక్‌ అట కదా’ అని రాజమౌళిని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ‘నాకు ఎటువంటి సంబంధం లేదు. నా సినిమా వరకు నేను బాధ్యతతో ఉంటా’ అని నవ్వేశాడు రాజమౌళి. ఇదే క్రమంలో ‘మీరు సంగీతంలో పెద్ద దిట్ట కదా’ అని కీరవాణిని అడిగిన బాలయ్యకు ‘నేను దిట్ట కాదు గుట్ట’ అంటూ ఆయన ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు.

Advertisement

Next Story