భారత్‌కు ఐక్యరాజ్యసమితి వార్నింగ్

by  |
భారత్‌కు ఐక్యరాజ్యసమితి వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
భారత్‌ను ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదుల కదలికలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ముఖ్యంగా కేరళ, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఐసిస్ ఉగ్ర‌వాదులు తిష్ట‌వేశార‌ని ఓ నివేదిక‌లో పేర్కొంది. దాదాపు 150 నుంచి 200 మంది టెర్రరిస్టులు దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌నే ముందస్తుగా హెచ్చరించింది.

బంగ్లా, భారత్, మయన్మార్, పాక్‌కు చెందిన 200 మంది ఉగ్రవాదులు ఈ బృందంలోని సభ్యులుగా ఉన్నార‌ని తెలిపింది. వీరంతా అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ అధ్యక్షుడు ఒసామా మహమూద్, అసీమ్ ఉమర్ మరణానికి ప్ర‌తీకారంగా దాడులు చేసేందుకు ప్లాన్ చేసుకున్నార‌ని నివేదికలో వెల్లడించింది.

యూఎన్ నివేదిక ప్రకారం.. 2019 మే 10న ప్రకటించిన ఐసీఎల్ ఇండియన్ అనుబంధ సంస్థ (హింద్ విలాయా)లో 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నారని ఒక సభ్య దేశం ప్రకటించింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో ఐసీఎల్ కార్యకర్తలు ఉన్నారని తేలింది. గతేడాది మేలో, ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ భారతదేశంలో కొత్త “ప్రావిన్స్”ను స్థాపించినట్లు నివేదించింది. కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరియు భద్రతా దళాల మధ్య నెలకొన్న ఘర్షణల త‌ర్వాత వెలువడిన మొదటి ప్ర‌క‌ట‌న ఇదే కావడం గమనార్హం. ఉగ్రవాద సంస్థ, దాని న్యూస్ ఏజెన్సీ ద్వారా, కొత్త శాఖ యొక్క అరబిక్ పేరు “విలాహ్ ఆఫ్ హింద్” గా తెలిపింది. ఇదిలాఉండగా జమ్మూ కాశ్మీర్ సీనియర్ అధికారి ఒకరు ఈ వాదనను తిరస్కరించినట్లు సమాచారం.



Next Story

Most Viewed