గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ పరిధిలోని ఓ రహదారిపై బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న బండ్లమోటు పోలీసులు వెంటనే బొల్లాపల్లి మండలం వెల్లటూరు – సరికొండ పాలెం మధ్య మార్గంలో గల రోడ్డుపై ఆ మహిళ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మొహంపై రక్తపు మరకలు ఉండటాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement